స్మార్ట్ రేషన్ కార్డులతో సంక్షేమ పథకాలు : మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

స్మార్ట్ రేషన్ కార్డులతో సంక్షేమ పథకాలు : మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

మెదక్​ టౌన్​/ చిన్నశంకరంపేట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత సన్నబియ్యం అందిస్తున్నామని భవిష్యత్​లో ప్రతి సంక్షేమ పథకం ఎలాంటి అవినీతికి తావులేకుండా నేరుగా పారదర్శకంగా అందుతాయని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. సోమవారం మెదక్ నియోజకవర్గంలోని చిన్నశంకరంపేట మండల కేంద్రం, మెదక్ పట్టణంలోని మంజీరా గార్డెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన వేర్వేరు కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని స్మార్ట్ రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ  గడిచిన పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త రేషన్ కార్డుల జారీలో నిర్లక్ష్యం జరిగి అనేక మంది అర్హులు సంక్షేమ ఫలాలకు దూరమయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ స్మార్ట్ కార్డులు అందజేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు నిధులు రాబడుతూ, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తున్నామని వెల్లడించారు.